Home / MOVIES / ”ఎంసీఏ”.. ఎలా ఉందంటే..!!

”ఎంసీఏ”.. ఎలా ఉందంటే..!!

నటీనటులు: నేచుర‌ల్ స్టార్ నాని, సాయి పల్లవి, భూమిక చావ్లా, విజయ్ వర్మ, నరేష్, రాజీవ్ కనకాల, పోసాని, ఆమని, ప్రియదర్షి , వెన్నెల కిషోర్, రచ్చ రవి .
కథ, కథ‌నం, దర్శకత్వం: శ్రీరామ్ వేణు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి : సమీర్ రెడ్డి
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
నిర్మాత : దిల్ రాజు (వెంకటేశ్వర క్రియేషన్స్)

కథ:

నాని, రాజీవ్ కనకాల అన్న దమ్ములు. అంతకన్నా బెస్ట్ ఫ్రెండ్స్. లైఫ్ హ్యాపీ గా సాగుతున్నప్పుడు రాజీవ్ కనకాల, జ్యోతి ని (భూమిక చావ్లా) పెండ్లి చేసుకుంటాడు. “ఎంకి పెళ్లి, సుబ్బు చావు కొచ్చింది” అన్న చందాన, అన్నయ్య, వదిన తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల, నాని హ్యాపీ లైఫ్ మాయం అవుతుంది. వదిన తన జీవితాని కి శత్రువు గా భావిస్తూ వుండటం వల్ల, ఆ ఇంట్లో ఉండలేక, వూరు వదిలి వాళ్ళ బాబాయ్ ఇంట్లో సెటిల్ అవుతాడు. నాలుగు సంవత్సరాలు గడిచాక వాళ్ళ అన్న (రాజీవ్ కనకాల) ఒక రోజు నాని ని ఇంటికి పిలుస్తాడు. జ్యోతి కి ట్రాన్స్పోర్ట్ కంట్రోలర్ జాబ్ వరంగల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వదిన కి తోడు గా నాని ని వరంగల్ లో ఉండమని కోరతాడు. ఇష్టం లేనప్పటికీ అన్నయ్య రిక్వెస్ట్ కాదనలేక వరంగల్ వెళ్తాడు. అక్కడ, పల్లవి (సాయి పల్లవి) నాని కి కలుస్తుంది. తన లవ్ ప్రపోస్ చేస్తుంది. నాని, పల్లవి తో లవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుండగా, నాని వదిన జ్యోతి, “శివ శక్తీ ట్రావెల్స్” ఓనర్ శివ (విజయ్ వర్మ) తో ప్రొఫెషనల్ ఇష్యూస్ వల్ల గొడవ పడుతుంది. వోటమి ని తట్టుకోలేని శివ, జ్యోతి ని చంపబోతాడు. నాని అడ్డుపడి వదినని రక్షిస్తాడు. పగ పెంచుకున్న శివ జ్యోతి ని పది రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేస్తాడు. విలన్ నుండి వదిన ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన కధాంశం.

మిడిల్ క్లాసు లైఫ్ స్టైల్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ వుందో తెలిపే కథ. నార్మల్ గా హీరో, హీరోయిన్ కోసం విలన్ తో ఫైట్ చేస్తాడు. ఇందులో వదిన కోసం చెయ్యడం ఒక్కటే రొటీన్ కి భిన్నం.

నటన :

నాని కి బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది. ఇలాంటి మిడిల్ క్లాసు కథ కి ఇక నాని కంటే బెటర్ గా ఎవరు న్యాయం చెయ్యగలరు చెప్పండి. చాల రోజుల తరువాత భూమిక ని ఫుల్ లెంగ్త్ రోల్ లో చూస్తున్నాం. తను వదిన పాత్ర లో చాలా చక్కగా ఒదిగి పోయింది. ఇక సాయి పల్లవి నటన ఫిదా మూవీ తో అందరికీ తెలిసిందే. ఇందులో ఫస్ట్ హాఫ్ వరకే సాయి పల్లవి కి ఎక్కువ సీన్స్ ఉంటాయి. తను నాని కి లవర్ గా చాలా బాగా నటించింది. ఇప్పటి వరకు నాని పక్కన నిత్య మీనన్ బెస్ట్ హీరొయిన్ అనిపించేది. ఈ సినిమాతో ఇంకో బెస్ట్ హీరోయిన్ ఆ లిస్టు లోకి చేరింది. సాయి పల్లవి డబ్బింగ్ తెలంగాణా యాస లోనే కాదు, ఏ తెలుగు యాస లో ఐనా అదర గొడుతుంది అని ప్రూవ్ చేసింది. ప్రియదర్షి , వెన్నెల కిషోర్, రచ్చ రవి , పోసాని కామెడి అక్కడక్కడ ఓకే అనిపించింది. కొత్త విలన్ విజయ్ వర్మ నెగటివ్ రోల్ బాగుంది. ఆమని, కథ కి అవసరం లేని చాల చిన్న రోల్ చేసింది.

కథనం, కథ, దర్శకత్వం:

కథనం, కథ, దర్శకత్వం:
శ్రీరామ్ వేణు ఎప్పుడో ఏడేళ్ళ క్రితం “ఓ మై ఫ్రెండ్” అనే సినిమా డైరెక్ట్ చేసాడు. ఇది అతనికి రెండో సినిమా. డైరెక్టర్ కి సినిమా స్టొరీ, మరియు కథనం లో చాల క్లారిటీ ఉంది. ఎక్కడా కూడా ఈ సీన్ అనవసరం అన్నది ఒక్కటి కూడా లేకుండా చాల నీట్ గా కథ రాసుకున్నాడు. అయితే తన మెయిన్ స్టొరీ అంతా సెకండ్ పార్ట్ లో వుంచి, ఫస్ట్ హాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ లైఫ్ మైండ్ సెట్, మిడిల్ క్లాస్ లవ్ స్టొరీ మీద సాగుతుంది. కామెడి సీన్స్ ఇంకొంచెం ఎక్కువ వుంటే బాగుండేది.
హీరొయిన్, హీరో ఇంట్లో వున్నా కూడా కొన్ని రోజులు తన పేస్ చూడక పోవటం నాచురల్ గా కనెక్ట్ కాలేదు. హీరొయిన్ ని, హీరో తన బైక్ మీద కాలేజీ లో డ్రాప్ చేస్తాడు కానీ ఒక్క సారి కూడా ఫేస్ చూడడు.
అలాగే తన వదిన, తను సెటిల్ అవడం కోసం ఎంతో త్యాగం చెయ్యడం ( సంతానం కొన్ని రోజులు ఆపడం, వున్న ఒకే ఒక ప్రాపర్టీ అమ్మడం) నరేష్ నాని కి చెప్పడం వల్ల, నాని కి అప్పటి వరకు వున్న కోపం ప్రేమ గా మారడం జరుగుతుంది. దీన్ని సపోర్ట్ చేసే కొన్ని సీన్స్ కథ లో ఇంక్లూడ్ చేసి వుంటే, కథనం ఇంకొంచెం ఎక్కువ గా ఆకట్టుకునేది. క్లైమాక్స్ కూడా ఇంకొంచెం ఇంటరెస్టింగ్ గా చేయ్యోచేమో అని అనిపించింది. వొదిన ఎక్కడ వుందో తెలుసు కోవడం కోసం తన జ్ఞాపక శక్తి తో పాటు టెక్నాలజీ కూడా వాడుకున్నట్లు చూపిస్తే (పేస్ బుక్, వాట్’స్ app తో పాటు సెల్ ఫోన్ ద్వారా లొకేషన్ ఐడెంటిఫై చెయ్యడం) క్లైమాక్స్ కి ఇంకొంచెం ఎక్కువ వెయిట్ యాడ్ అయ్యేది.

డిపార్ట్మెంట్స్:

 

ఈ సినిమా కి సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి సాంగ్స్ లో కొంచెం కొత్త టెక్నిక్ వాడారు. రాక్ స్టార్ DSP సాంగ్స్ న్యూ ట్యూన్స్ కాకపొఇనా కూడా, వినాలనిపించేట్లు వున్నాయి. సాంగ్స్ టేకింగ్ కూడా బాగా కుదిరింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి మూవీ బోర్ కొట్ట కూడా సూపర్బ్ ఎడిటింగ్ చేసాడు. ఈ ఎడిటర్ ఎన్నో మంచి సినిమాలకి ఎడిటింగ్ చేసినా కూడా ( అత్తారింటికి దారేది, జులాయి, మనం) రావల్సినంత పేరు రాలేదు అనిపిస్తుంది. రేపటి హలో మూవీ కూడా ప్రవీణ్ దే.

దిల్ రాజు ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిన పని లేదు. మూవీ కి ఎక్కడా పైసా ఎక్కువ అని కాని, పైసా తక్కువ అని కాని అనిపించదు.
హీరో నాని మూడో హట్రిక్ ఈ సినిమా తో స్టార్ట్ చేసాడు. ఇన్ని వరుస హిట్స్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎక్కడా బోర్ కొట్టదు. కొన్ని చోట్ల ఇంకొంచెం బెటర్ గా వుంటే బాగుండేది అనిపిచడం తప్ప.

రేటింగ్: 3/5

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat