తిరుమలగిరి లో జయలక్ష్మి గార్డెన్ లో మాదిగ, మాదిగ ఉపకులాల ముఖ్యనాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్, 31 జిల్లాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ తన వ్యతిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని మండిపడ్డారు.
వర్గీకరణతో పాటు మాదిగ జాతి అభివృద్ధే తెలంగాణ ఎమ్మార్పీఎస్ లక్ష్యమని వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 23ఏళ్ళు గడిచినా ఉద్యమంలో మాదిగలకు కేసులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంద కృష్ణ మాదిగ తన వ్యతిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని ఆరోపించారు. మోత్కుపల్లి నర్సింహులు ద్వారా టీడీపీదో దోస్తీకట్టి, సర్వే సత్యనారాయణతో కాంగ్రెస్ దోస్తీకి సిద్ధపడి మాదిగలను తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు రాజ్యాదికారమే లక్ష్యమంటూ మందకృష్ట మాట్లాడతాడని…. ఎన్నికలయ్యాక వర్గీకరణ అంటాడని ఆరోపించారు.
ఎమ్మార్పీఎస్ జెండాను మర్చిపోతున్నానంటూ గతంలో మంద కృష్ణ శాయంపేటలో మాట్లాడాడని వంగపల్లి గుర్తు చేశారు. మాదిగ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరులను, వాళ్ళ కుటుంబాలను మర్చిపోయిన ఘనత మంద కృష్ణదని ఎద్దేవా చేశారు. మాదిగ వర్గీకరణ న్యాయమైన డిమండ్ అని స్వయంగా సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డితో కలసి పనిచేసిన చరిత్ర మంద కృష్ణదన్నారు. భవిష్యత్తులో ఎమార్పీఎస్ అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చే పార్టీతో కలసి పనిచేస్తామన్నారు. వర్గీకరణ కోసం ప్రధాన మంత్రిని కలసిన ఘనత తెలంగాణ ఎమార్పీఎస్ దేనని ఉన్నారు.
మాదిగ జాతి అభివృద్ధి విషయంలో మందకృష్ణతో రాజీపడే ప్రసక్తే లేదని వంగపల్లి అన్నారు. మాదిగ జాతి మంద కృష్ణను బహిష్కరించే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు. మాదిగ జాతి సంక్షేమానికి కృషి చేస్తోన్న సీఎం కేసీఆర్ కు రక్షణ కవచంగా పని చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రపతి రాకను మందకృష్ణ అడ్డుకుంటామంటున్నాడు.. రాష్ట్రపతికి మేం రక్షణగా ఉంటామన్నారు. అంబేడ్కర్ పూలే విధానాలే తమ విధానాలని…దాడులు హింస మా సంస్క్రతి కాదని స్పస్టం చేశారు.
Tags mandhakrishna mrps pidamarty ravi telangana tmrps vangapalli srinivas