తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ రోజు సాయంత్రం 6గంటలకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.
‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6.30-7.00 గంటల వరకు మలేసియా తెలుగు సాంస్కృతిక కదంబ కార్యక్రమం జరగనుంది.