ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్ క్రాస్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకు బిల్వంపల్లికి చేరుకుంటుంది.
10.30కు నెలకోట తండా చేరుకున్నాక అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఎగురవేస్తారు.
11.30కు నెలకోట చేరుకుంటారు. 12.30కు ధర్మవరంలో భోజన విరామం ఉంటుంది. పాదయాత్ర సందర్భంగా పలు తీర్మానాలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటకు బుడ్డారెడ్డిపల్లలో పాదయాత్ర కొనసాగుతుంది.
4.30కు ఎలకుంట్ల చేరుకుంటుంది. అక్కడినుంచి సాయంత్రం 6 గంటలకు తనకంటివారిపల్లికి చేరుకుంటుంది. జగన్ అక్కడే రాత్రి బస చేస్తారు.