తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు.
అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. స్వీయ నియంత్రణతోనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు.
రాబోయే 10-20 ఏండ్లలో హైదరాబాద్ జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో జనాభా అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సర్కిళ్లను పెంచామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసమే సర్కిళ్లను పెంచుకున్నట్లు ఆయన వెల్లడించారు.