తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికి ఆదర్శం అని కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి అన్నారు .త్రాగునీరు ,పారిశుధ్య పథకాలపై కేంద్రమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మిషన్ భగీరథపై ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు .అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులపై హర్షాన్ని వ్యక్తం చేశారు .ఈ పథకం దేశానికే ఆదర్శం అని ఆయన కొనియాడారు .రాష్ట్రంలో ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలనుకోవడం మంచి పరిణామం అని అన్నారు .అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల అనంతరం మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తాను అని ఆయన తెలిపారు .
