ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కురుపాం అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మావయ్య ,మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ అధికార టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు .
నిన్న శుక్రవారం నియోజక వర్గ పరిధి చినమేరంగి కోటలో పార్టీ పరిశీలకులు కాకి గోవిందరెడ్డి ,శ్రీకాకుళం ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు అధ్వర్యంలో జియ్యమ్మవలస మండల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు .
ఈ సమావేశానికి చంద్రశేఖర్ రాజ్ హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన పార్టీలోకి వస్తాను అని తెలిపారు .దీంతో త్వరలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ గూటికి చేరాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు