తుమ్మల నాగేశ్వరరావు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ..దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు .అయితే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ నేతకు దక్కని అరుదైన రికార్డు తుమ్మల సొంతం చేసుకున్నారు .
అప్పటి ఏపీ లో మొట్టమొదటి సారిగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన తుమ్మల అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా 1986-89వరకు పదవీ బాధ్యతలు నిర్వహించారు .ఆ తర్వాత 1995-2004 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు .రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన మొదట ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు .
సరిగ్గా ఇదేరోజు 2014లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు .దీంతో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కని పదిహేను యేండ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేతగా తుమ్మల నాగేశ్వరరావు రికార్డును సొంతం చేసుకున్నారు .అయితే తుమ్మల పొలిటికల్ కెరీర్ ను పరిశీలిస్తే ఏ మంత్రిత్వ శాఖా చేపట్టిన కానీ తనదైన ముద్ర వేసుకున్నారు .మొదట రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న తుమ్మల రాష్ట్రంలో పల్లె పల్లె నుండి రాష్ట్ర స్థాయి వరకు ,మారుమూల ప్రాంతాల రోడ్డ్ల నుండి జాతీయ రోడ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్నిటిని ఏర్పాటు చేయించి తనదైన ముద్ర వేస్తున్నారు .మరోవైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధి ,పౌష్టిక ఆహారం పంపిణీ తదితర శాఖాపరమైన పనులను పర్యవేక్షిస్తూ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారు ..