ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అసలేం జరిగిందనేది అందరీక ఆసక్తిని కలిగించే అంశమే. హైటెక్‌సిటీ లోని టెక్ మహీందా క్యాంపస్‌లో జరుగుతున్న మిషన్ ఇన్నోవేషన్ 2018 కార్యకమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగించడంతో పాటుగా పలువురు ఉద్యోగలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌ను నిలపడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర పోషించారని, ఆ సంస్థ చైర్మన్ బిల్‌గేట్స్‌తో సంప్రదింపులు చేశారని అన్నారు. అయితే హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందడం వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు. బెంగళూర్, చెన్నై, గుర్గావ్తో పోల్చుకుంటే…హైదరాబాద్ నగరం పర్యావరణహితం, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అనేక కంపెనీలు హైదరాబాద్ బాట పట్టేందుకు ఇవన్నీ కీలక కారణాలని ఆయన వివరించారు.
ఇది…అసలు జరిగింది. అయితే దీనిని తమదైన శైలిలో వార్తలు వడ్డించారు. దీనితో పాటు మంత్రి కేటీఆర్ అనేక అంశాలను పంచుకున్నారు. హైదరాబాద్‌కు టెక్ సిటీతో పాటుగా స్టార్టప్ సిటీగా ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔత్సాహిక పారిశామిక వేత్తలను పోత్సహించడానికి టీహబ్‌ను స్థాపించామని వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ ఏడాది ఫేజ్-2ను వచ్చే సంవత్సరం ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 జాబితాలో ఉన్న కంపెనీలు నగరానికి రావడం ద్వారా హైదరాబాద్ టెక్ సిటీగా గుర్తింపు పొందిందని తెలిపిన మంత్రి కేటీఆర్ స్టార్టప్‌లకు కేంద్రంగా హైదరాబాద్‌ను మారుస్తామని వెల్లడించారు.
ఇందుకోసం టీహబ్, టీవర్క్స్, ఇమేజ్ టవర్స్ ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, జెడ్ఎఫ్, అమెజాన్ లాంటి వరల్ టాప్ 5 కంపెనీలు హైదరాబాద్ వచ్చాయని వివరించారు.ఏపీలో ఉన్న అమరావతి కూడా అభివృద్ధి చెందాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 19-21 వరకు మూడు రోజులపాటు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు నిర్వహించబోతున్నామన్నారు. టెక్ మహీంద్రా కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌కి మార్చాలని కోరుతున్నామన్నారు. టెక్‌మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ, ఉపాధ్యక్షుడు ఏఎస్ మూర్తి , సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.