టీఆర్ఎస్ పార్టీ అధినేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ‘‘ఉద్యమ సమయంలో తెలుగుతల్లిని అవమానించారు. ఎవరీ తెలుగుతల్లి…ఎవడికి తల్లి అని తూలనాడారు. మహాసభల పేరుతో నాలుగు రోజులు హడావిడి చేస్తే తెలుగు భాషాభివృద్ధి జరగదు’’ అని రేవంత్‌రెడ్డి లేఖ రాసారు . తెలుగు పాఠశాలలను మూసేస్తూ తెలుగును ఎలా పరిరక్షిస్తారు? అని ప్రశ్నించారు.
