జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ మరోసారి విమర్శలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
తాజాగా రాజకీయాల్లో కొనసాగాలంటే ఈ లక్షణాలు కావాలంటూ జనసేన అధినేతకు, ఆయన అభిమానులకు హితబోధ చేశాడు. రాజకీయాల్లో మనుగడ సాగించాలని అనుకునేవారికి సహనం, సంయమనం ఉండాలని సూచించాడు. ఎవరు తిట్టినా, పొగిడినా వాటిని ఆశీస్సులుగా తీసుకునే వారే రాజకీయాల్లో ఉండాలని సలహా ఇచ్చాడు. సోషల్ మీడియాలో చంద్రబాబు, జగన్ లాంటి నేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటారు. అయినప్పటికీ వారు కానీ, వారి అనుచరులు కానీ అలా విమర్శించిన వారిని తిట్టడం, భౌతిక దాడులు చెయ్యడం ఎక్కడా జరగలేదు. తమ మీద వచ్చే విమర్శలను మౌనంగా భరిస్తుంటారు. అందుకే ఆ నాయకులు దశాబ్దాల తరబడి రాజకీయాల్లో నిలబడగలిగారు. కానీ, జనసేన అనే పార్టీకి అలాంటి లక్షణం కనిపించడం లేదని కత్తి మహేష్ అభిప్రాయపడ్డాడు.
అయితే పవన్‌ను విమర్శించిన వారిని తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. భౌతికదాడులకు పాల్పడుతున్నారని కత్తి వాపోయాడు. రాజకీయాల్లో రౌడీతనం చెల్లదు. విమర్శలకు ఎవరూ భయపడరు. జనసేనకు రాజకీయాల్లో కొనసాగే లక్షణం లేదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని కత్తి మహేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేన అనేది ఒక గాలిపార్టీ అని ఇలాంటి వెర్రి అభిమానులు రుజువు చేస్తున్నారు. 2019 తరువాత జనసేన కూడా ప్రజారాజ్యం లాగానే అదృశ్యం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇకనైనా పవన్ అభిమానులు తమ తీరు మార్చుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. లేకపోతే ప్రజలు చిరంజీవికి పట్టించిన గతే పవన్‌కు కూడా పట్టిస్తారని హెచ్చరించారు. అయితే ఈ వాఖ్యలు మాత్రం చాలా దూమరం రేపుతున్నాయి. పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో .అసలే ప్రజారాజ్యం పార్టీ పరువు పోయిందని….దాని మాటే లేకుండా అలానే ఉండి పోయారు అభిమానులు. మళ్లీ జనసేన పార్టీని ప్రజారాజ్యంతో పోలిస్తే ఇంకేమైన ఉందా..”సోషల్ మీడియాలో రెచ్చి పోయి కామెంట్స్ పెడుతున్నారు. మెగాబ్రదర్స్ ఏమైతే అనగోడదో.. అదే మాట అన్నాడు కత్తి మహేష్. మరి ఈ వివాదం ముదిరి ఎంత వరకు వెలుతుందో చూడాలి