టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి రేసులో సినిమాల పరంగా బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ ఇద్దరూ అప్పుడే సిద్దం అయ్యారు. సింహా అనే పవర్ ఫుల్ పొలిటికల్ సినిమా తో బాలయ్య రాబోతూ ఉండగా పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి అనే ఎమోషనల్ ఫామిలీ డ్రామాతో అడుగు పెట్టబోతున్నాడు. ఈ పరిస్థితి లో సంక్రాంతి రేసులో ఇంకెవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సూర్య సినిమా గ్యాంగ్‌తో పాటు విశాల్ తన కొత్త సినిమా అభిమన్యుడుతో రంగం లోకి దిగుతాడు అనే న్యూస్ వచ్చింది.
ఇక చాలా కాలం తరవాత తెలుగులో డిటెక్టివ్ తో హిట్ సాధించాడు హీరో విశాల్. ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో అభిమన్యుడు తో సంక్రాంతికి వచ్చి పవన్, బాలయ్య లకి షాక్ ఇవ్వాలి అనుకున్నాడు. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న సమంత విశాల్ కి ఈ విషయం లో గట్టి వార్నింగ్ ఇచ్చిందట. తెలుగు నాట పవన్, బాలయ్యల సినిమాల విడుదల కోలాహలం మామూలుగా ఉండదనీ అది కూడా సరిగ్గా సంక్రాంతి టైం అంటే ఆ రచ్చ అదిరిపోతుందనీ, ఆ టైంలో తమ సినిమా విడుదల చేస్తే థియేటర్ లు దొరకవు సరికదా సినిమా టాక్ ఎంత బాగా వచ్చినా మిగితా రెండు సినిమాల ప్రభావం ముందు తట్టుకోలేమని, ఆమె గట్టిగా చెప్పేసిందట. దీంతో ఆలోచించుకున్న విశాల్ తన నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకున్నాడని సినీ వర్గీయుల్లో చర్చించుకుంటున్నారు.