రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యల గురించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కీలక నిర్ణయాలు వెలువరించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కే తారక రామారావు, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సారథ్యంలో సాగిన ఈ భేటీకి
పోలీసు శాఖ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, ట్రాఫిక్ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న భద్రతా చర్యలతో పాటు, రోడ్డు ప్రమాదాలను మరింత తగ్గించేందుకు చేపట్టవలసిన శాఖాపరమైన మరియు ఎన్ఫోర్స్మెంట్ చర్యలపైనా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం వైపునుంచి తీసుకోవాల్సిన చర్యలతోపాటు ప్రమాదాల నివారణకు ప్రజల్ని మరింత చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులు సూచించారు.
తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఇంజనీరింగ్ పరిష్కారాలను సూచించాలని రోడ్లు భవనాల శాఖకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న రహదారుల్లో జంక్షన్లను మరింత అభివృద్ధి పర్చాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణం వైద్య సహకారం అందించేందుకు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన పలు కార్యక్రమాల అధ్యయనం చేయాల్సిందిగా మంత్రులు ఆయా అధికారులకు స్పష్టం చేశారు.
Participated in deliberations of the cabinet sub-committee chaired by R&B Minister Tummala Garu on Road Safety along with Ministers Transport, Panchayat Raj & Law
Proposed number of measures to reduce number of accidents/fatalities in Telangana. Lots to do on this front pic.twitter.com/ZXMKon2i89
— KTR (@KTRTRS) December 11, 2017