ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలను ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శుక్రవారం ప్రకటించారు .ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విలువ ప్రకారమే తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నట్లు నారా లోకేష్ నాయుడు మీడియాకు తెలిపారు .
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు రెండు కోట్ల ముప్పై మూడు లక్షలుగా తెలిపారు .అంతే కాకుండా తన తల్లి భువనేశ్వరి నికర ఆస్తులు ఇరవై ఐదు కోట్ల రూపాయల నలబై ఒక్క లక్షలు ,తన సతీమణి బ్రాహ్మణి నికర ఆస్తులు కేవలం 15 కోట్ల ఒక లక్ష రూపాయలు ,తన తనయుడు దేవాన్స్ ఆస్తులు పదకొండు కోట్ల యాబై నాలుగు లక్షల రూపాయలుగా ఆయన తెలిపారు ..