మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ ఉప్పల్ – నాగోల్ మద్య షీ టీమ్ పోలీసులు నిర్వహించిన డేకాయ్ అపరేషన్లో అంబర్పేట్లోని అబ్దుల్లాపూర్మెట్ నివాసి ఎన్. నరసింహ తన మోబైల్ ఫోన్ ద్వారా మెట్రో రైలులో తన ఎదురు సీట్లో కూర్చొని ప్రయాణిస్తున్న అమ్మాయిల ఫొటోలు తీస్తూ పట్టుబడ్డాడు. దీన్ని గుర్తించిన షీ టీమ్ బృందం అతడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సందర్భంగా అతని మొబైల్ ఫోన్లో అమ్మాయిల ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. సెక్షన్-354కింద అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.