తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్‌లోని ప్రతిమ హోటల్‌లో సంతోష్‌రావు సన్నిహితుల మధ్య కేక్ కట్ చేశారు. సంతోష్‌కు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సి శంభీపూర్ రాజు ..సహా పార్టీ నేతలు మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్‌రావు నగునూరులోని దుర్గాభవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు పలువురు సంతోష్‌రావుకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.