తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు . ఐటీ, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఇవాళ సమీక్ష సమావేశం జరిపారు .
Minister @KTRTRS conducted a review meeting with Sr Officials from IT, Industries Dept and @TSIICLtd and reviewed the progress of Pharma City, Medical Devices Park, #TWorks and other initiatives. pic.twitter.com/xGzUDJNmug
— Min IT, Telangana (@MinIT_Telangana) December 6, 2017
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ఇంటింటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో పని చేయాలని ఈ బేటీ సందర్బంగా అధికారులకు సూచించారు .ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులపై ప్రత్యేకంగా చర్చించిన మంత్రి కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ కింద అందిస్తున్న ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అధికారులకు వివరించారు.