విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. తాను ఎవరికి భయపడబోనని ,తాను ఎప్పుడు పైరవీలు చేయలేదని,పరిశ్రమ లైసెన్స్ అడగలేదు..ట్రాన్సర్ లు అడగలేదు. ప్రజల సమస్యలను అడుగుతున్నానని ఆయన అన్నారు.రాస్ట్రం విడిపోయి నాలుగేళ్లు అయినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.జనం కోసం జైలు కు వెళ్తానని, లాఠీ దెబ్బలు తింటానని ఆయన అన్నారు.టిడిపి,సమస్యలు తీర్చడానికి బిజెపిలకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదని అన్నారు.మానిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రదాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని ఆయన అన్నారు.తనకు అదికార దాహం లేదని ఆయన అన్నారు.
