తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధికి ప్రభుత్వం మంచి ప్రణాళికలు తయారు చేస్తుందని అధికార పార్టీ ఎమ్మెల్సి కర్నెప్రభాకర్ అన్నారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ కమిటీ హాల్ లో మూడురోజుల పటు బీసీ అభివృద్ధి పై చర్చ జరిగిందని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చాక ఎం బీ సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ 1000 కోట్లు కేటాయించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసారు . గత ప్రభుత్వాలు ఓట్ల కోసమే రాజకీయాలు చేశాయని మండిపడ్డారు . 113 బీసీల కులాల కు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.బీ సీ సమస్యలపై చర్చిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు బెంబేలెత్తి పోతున్నారని పేర్కొన్నారు. కొలువుల కొట్లాట పేరుతో విద్యార్థులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. శ్రీకాంతాచారి చావుకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నేతలను కొలువుల కొట్లాట సభలో మాట్లాడించినందుకు కోదండరాం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో ఏసీల కింద కూర్చొని బీసీల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
Tags mlc karne prabhakar