ఏపీలో ఫ్యాక్షన్ హత్యలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు వైసీపీ నేతలను దారుణంగా హత్య చేస్తున్నారు. రాయలసీమలో మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగలు విప్పింది. జిల్లాలోని ధర్మవరం మండలం వడంగపల్లిలో వైసీపీ నేత చెన్నారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పథకం ప్రకారం కాపు కాచి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన ఇప్పుడు ధర్మవరంలో కలకలం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.