తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ అభివృద్ధి, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు గ్లాండ్ ఫార్మా కంపనీ చేయూతగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, సిద్ధిపేట పట్టణ అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సంకల్పానికి గ్లాండ్ ఫార్మా కంపనీ జత కలిసింది.
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తో సిద్దిపేట పట్టణ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ అధికారిక యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు సిద్ధిపేట పట్టణ అభివృద్ధి, మిషన్ కాకతీయ పథకం చెరువుల పునరుద్ధరణకు తమ వంతు బాద్యతగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ కంపెనీ గ్లాండ్ ఫార్మాసంస్థ అధినేత పివి ఎన్ రాజు సీఎస్ఆర్ కింద రూ.50లక్షల మేర నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చారు.
ఈ మేరకు హైదరాబాదులోని మంత్రి నివాసంలో రూ.50 లక్షలు చెక్కును మంత్రికి అందజేశారు. గతంలో మంత్రి హరీష్ రావు సూచన మేరకు సిద్దిపేట కు వచ్చి పట్టణంలో జరిగిన అభివృద్ధి కోమటి చెరువు బ్,వైకుంటాదామలు ,రోడ్లు ,చెట్లు చూసి మంత్రి హరీష్ రావు గారి అభివృద్ధి కి ఆకర్షితుయ్యాడు ..నేను సైతం హరిశ్ రావు గారికి తోడు ఉంటా. అభివృద్ధి లో బాగస్వమ్యం అవుతా నావంతు సహకారం అందిస్తా అని సిద్దిపేట అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు.. ఈ విషయమై మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిలు సంస్థ ఛైర్మన్ పీ.వీ.ఎన్.రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.