Home / TELANGANA / మెట్రో రైళ్లలో షీ టీమ్స్

మెట్రో రైళ్లలో షీ టీమ్స్

హైదరాబాద్ నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, షాపింగ్ మాల్స్ వద్ద, మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే షీ టీమ్స్ బృందాలు తమ విధులు నిర్వహిచేవి. మెట్రో రైళ్లు ప్రారంభం కావడంతో మెట్రో స్టేషన్లు, రైళ్లలో మహిళలకు భద్రత కోసం దేశంలోనే మొదటిసారిగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. మహిళలను, యువతులను వేధింపుకు గురిచేసే పోకిరీల ఆట కట్టించేందుకు పోలీస్ శాఖ నడుంబిగించింది. ఆకతాయిలు పోకిరీ చేష్టలకు పాల్పడితే కేసులు పెడతామని, మహిళలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చని, ఎమర్జెన్సీ నెం. 100కు కూడా డయల్ చేవచ్చని షీ టీమ్స్ చీఫ్ స్వాతిలక్రా తెలిపారు. ఫిర్యాదు చేసే మహిలళు, యువతుల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

మెట్రో రైళ్లలో ప్రయాణికులకు షీ టీమ్స్‌పై హైదరాబాద్ షీ బృందాలు ఆదివారం అవగాహన కల్పించాయి. మెట్రో రైళ్లతో పాటు స్టేషన్లలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా వెంటనే షీ టీమ్స్‌కు సమాచారం ఇవ్వాలని కరపత్రాలను ప్రయాణికులకు పంపిణీ చేశారు. షీ టీమ్స్ నిఘా ఉంటుందని, ఎవరైనా విద్యార్థినులను, ఉద్యోగులను, ఇతర మహిళలను వెంబడిస్తూ …వేధించడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే వారి సమాచారాన్ని డయల్ 100కు ఇవ్వాలని సూచించారు. నేరుగా షీ టీమ్స్‌ను సంప్రదించడం, డయల్ 100, షీ టీమ్స్ ఫేస్‌బుక్, హెచ్‌వైడీషీటీమ్స్<\@>జీమెయిల్.కాం, 9490616555 వాట్సాప్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసేవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ప్రయాణికులకు వివరించినట్లు షీ టీమ్స్ ఇన్‌చార్జ్జి స్వాతి లక్రా తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat