Home / SLIDER / మంత్రి కేటీఆర్ గైడెన్స్‌తో దేశంలోనే రికార్డు సృష్టించిన మ‌న మీసేవా

మంత్రి కేటీఆర్ గైడెన్స్‌తో దేశంలోనే రికార్డు సృష్టించిన మ‌న మీసేవా

మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్ర మీసేవా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో దూసుకుపోతోంది. స్వల్పకాలంలోనే పదికోట్ల సేవల మార్క్‌ను దాటేసింది. తద్వారా పది కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. రాష్ట్ర విభజనకు ముందు మీసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ..తెలంగాణ ఆవిర్భావం తర్వాత సేవల్లో పెద్ద ఎత్తున వృద్ధి స్పష్టంగా కనిపించింది. ఆన్‌లైన్‌ విధానంలో మరిన్ని సేవలను అందించేందుకు తెలంగాన మీసేవా ఏర్పాట్లు చేస్తోంది.

 2011 నవంబర్‌లో మీసేవా ప్రారంభం కాగా రాష్ట్ర ఆవిర్భావం అయిన జూన్‌ 2017 నాటికి 2.5 కోట్లుగా నమోదు అయింది. అయితే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా ఈ ఏడాది నవంబర్‌ చివరి వారానికి పదికోట్ల లావాదేవీలు పూర్తిచేసి రికార్డు సృష్టించింది. మొదటి రెండున్నర కోట్ల లావాదేవీలకు 6 ఏండ్ల సమయం తీసుకోగా… 7.5 కోట్ల లావాదేవీలు కేవలం మూడున్నరేండ్లలోనే కావడం గమనార్హం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవే కారణమని తెలుస్తున్నది. ఆన్‌లైన్‌లో సేవలు పెంచడం, దళారుల వ్యవస్థను తొలగించేలా అన్ని సేవలను ఆన్‌లైన్‌ ద్వారానే అందించడం ద్వారా తెలంగాణ మీసేవా ఈ విశిష్టతను సంతరించుకుంది. 2016 వరకు రవాణ శాఖ కార్యకలాపాలు అన్నీ శాఖాపరంగానే చేసే వారు. అయితే దళారుల విధానంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ప్రతి లావాదేవీ మీసేవా ద్వారానే జరగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మీసేవాల్లో సేవలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం కేవలం ఒక్క రవాణాశాఖకే రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి మీసేవా తన సేవలను అందిస్తున్నది. తద్వారా ఒక్క శాఖకు 20వేల సేవలు అందిస్తున్న మీసేవా మరేది లేకపోవడం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు ఆన్‌లైన్‌ ఆధారిత సేవలు అందించాలనే లక్ష్యం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం మూడు రకాల మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌, మొబైల్‌, ఆన్‌లైన్‌ సహాయకారి (అసిస్టెడ్‌-మీసేవా). ఆయా వెబ్‌సైట్లు అందిస్తున్న సేవల విషయంలో కానీ లేదా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్నా ఆన్‌లైన్‌లో 30 శాతం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగతా వారికి ఆ సదుపాయం లేకపోవడంతో ఈ విషయంలో సహాయకారిగా తెలంగాణ మీ సేవా నిలిచింది. మీసేవా అందిస్తున్న సేవల ద్వారా కార్యాలయాలకు నేరుగా వెళ్లి తిప్పలు సామాన్యులకు తప్పాయి. ప్రస్తుతం 38 శాఖలకు చెందిన 600 సేవలను మీసేవా అందిస్తోంది. పటిష్టమైన సేవలు అందుబాటులో ఉండటం వల్ల 4,500 ఫ్రాంచైజీల ద్వారా లక్ష నుంచి లక్షా యాభైవేల లావాదేవీలు ప్రతిరోజుకూ అందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat