భవిష్యత్తు మీద యువత నిరాశకు గురైతే దేశానికే మంచిది కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కొలువులకై కొట్లాట సభలో పాల్గొన్న కోదండరామ్ మాట్లాడుతూ.. ‘మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు ఒక సందేశం పంపాలని, వారికి మన సత్తా చాటి కనువిప్పు అయ్యేవిధంగా సభను విజయవంతం చేయాలి.ఈ సభను విజయవంతం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సభకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రరావు, టీడీపీ నేత ఎల్ రమణ తదితరులు హాజరు అయ్యారు.
Tags kodandaram