ప్రముఖ మొబైల్ వ్యాపార సంస్థ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రవేశపెట్టిన జియో దాటికి మిగత టెలికాం సంస్థలన్నీ తలలు పట్టుకుంటున్నాయి .జియో ఆఫర్స్ కు ఆకర్షితులై తమనుండి పోతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించుకోవడానికి సరికొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతుంది .ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది .
ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కేవలం రూ .198 కే అపరిమిత కాల్స్ తో పాటుగా డైలీ వన్ జీబీ డాటాను ,లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ లను ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది .అయితే ఇక్కడ ఒక చిన్న షరత్ ను పెట్టింది .ఏమిటి అంటే ఇన్ కమింగ్ కాల్స్ కు మాత్రమే రోమింగ్ ఉచితం ఇస్తూ అవుట్ గోయింగ్ కాల్స్ కు మాత్రం రోమింగ్ చార్జ్ వేస్తున్నట్లు ఎయిర్ టెల్ తన ఆఫర్ లో పేర్కొంది .
ఇప్పటికే ఎయిర్ టెల్ రూ .349 తో రీచార్జ్ చేసుకున్నవారికి 1.5 జీబీ 3జీ /4జీ డేటా ,అపరిమిత కాల్స్ తో పాటు లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ ల సదుపాయాన్ని ఇరవై ఎనిమిది రోజుల పాటు అందజేస్తుంది .అంతే కాకుండా రూ .448 తో చేసుకుంటే డైలీ1.5 జీబీ 3జీ /4జీ డేటా ,అపరిమిత కాల్స్ తో పాటు లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ ల సదుపాయాన్ని డెబ్బై రోజుల పాటు అందజేస్తుంది .