Home / MOVIES / బిగ్ బ్రేకింగ్ .. సెక్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డ్డ సినీ, టీవీ నటీమ‌ణులు..!

బిగ్ బ్రేకింగ్ .. సెక్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డ్డ సినీ, టీవీ నటీమ‌ణులు..!

ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అబివృద్ది వైపు ప‌రుగులు పెడుతుంటే…కొంతమంది అమ్మాయిలు,నటీమణులు మాత్రం దాని పేరు చెడగొడుతున్నారు. హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలు పట్టుమడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్ అయింది. ఘట్‌కేసర్ పరిసరాల్లో ఈ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు.

సెక్స్ రాకెట్‌లో సినీ, టీవీ నటీమణులు..
ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రాంతంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించడంతో ఇద్దరు సినీ, టీవీ నటీమణులు, ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఘట్‌కేసర్‌ మండలం పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ టౌన్‌షిప్‌లో స్వామి అనే యువకుడు ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నాడు. ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అల్వాల్‌కు చెందిన నరేష్‌ అనే యువకుడు ఆన్‌లైన్‌ ద్వారా ఇద్దరు అమ్మాయిలను రెండు గంటల సమయం కోసం రూ.1.20 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. శనివారం రాత్రి ఆరు గంటల సమయంలో ఇద్దరు అమ్మాయిలు టౌన్‌షిప్‌ వద్దకు వచ్చినట్లు మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్ కుమార్‌, ఎస్సై మహేశ్‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించి అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారు సినీ, టీవీ నటీమణులుగా గుర్తించినట్లు ఎస్వోటీ సీఐ నవీన్ కుమార్‌ తెలిపారు. నిర్వాహకుడు స్వామి, నరేష్‌ను అరెస్ట్ చేసి ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నగరంలో ఎక్కడ సెక్స్ రాకెట్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చి హైదరాబాదు నగరానికి మంచి పేరు తీసుకురావలని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat