కన్న కూతురిగా చూడాల్సిన కోడలిపై భార్య సహకారంతోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ దాస్ అనే 60 ఏళ్ళ వ్యక్తి.ఈయనకు ముగ్గురు భార్యలు. అయినా కన్న కొడుకు భార్యపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకోని తన భార్య సహయంతో దారుణానికి ఒడిగట్టాడు.దీని కారణంగానే కోడలు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాబు, ఆ వృద్ధుని రక్తనమూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపారు. ఇద్దరు డీఎన్ఏ సరిపోవడంతో అత్త, మామలపై కేసు నమోదు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..!
సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన బి.మోహన్‌దాస్(60) రైల్వేలో పనిచేసే రిటైర్ అయ్యాడు. ఆయనకి ముగ్గురు భార్యలు ఉన్నారు. మోహన్‌దాస్ ఉంటున్న ఇంట్లోనే మూడో అంతస్తులో ఆయన కుమారుడు, కోడలు ఉంటున్నారు. కోడలిపై కన్నేసిన మోహన్‌దాస్.. మూడో భార్య భారతి సహకారాన్ని కోరాడు. ఆమె మత్తుమందు కలిపిన జ్యూస్‌ను కోడలుకు ఇచ్చేది. కోడలు మైకంలోకి జారగానే మామ వెళ్లి అత్యాచారం చేసేవాడు. అలా వీలు చిక్కినప్పుడల్లా భార్య సహకారంతో అత్యాచారం చేశాడు.
తాజాగా ఈ విషయం కోడలికి తెలిసిపోయింది. దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడి రక్తాన్ని తీసి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. అతను మోహన్‌దాస్‌కే పుట్టాడని తేలింది. దీంతో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన భారతిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.