హైదరాబాద్ మెట్రో ప్రారంబానికి ముందే కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలనే మెట్రో రైలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు , మెట్రో రైలు ఛార్జీలు భారీగా ఉంటాయి అని పలు రకాలుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే .కాని తొలి రోజు ప్రారంభం నుంచే హైదరాబాద్ మెట్రో దేశంలోని అన్ని మెట్రో రైలు రికార్డులను తిరగరాస్తు దూసుకెళ్తు౦ది.ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ..మెట్రో రైలు ప్రయాణానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని.. జీహెచ్‌ఎంసీ కార్మికులు మెట్రోలో ప్రయాణించిన ఫోటోలను షేర్ చేశారు.
Glad Hyderabad Metro is being enjoyed by all sections of people
GHMC workers have also enjoyed it today ? pic.twitter.com/GitFlDyaA1
— KTR (@KTRTRS) December 2, 2017
రెండో దశ విస్తరణలో భాగంగా మరో 80 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. చేపట్టిన మెట్రో పనులన్నింటినీ పూర్తి చేసిన అనంతరం శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరణ కార్యక్రమాన్ని చేపడాతామన్నారు.