Home / ANDHRAPRADESH / వైసీపీ శ్రేణులు సగర్వంగా తల ఎత్తుకునే వార్త -జగన్ దెబ్బకు దిగొచ్చిన బాబు సర్కారు..

వైసీపీ శ్రేణులు సగర్వంగా తల ఎత్తుకునే వార్త -జగన్ దెబ్బకు దిగొచ్చిన బాబు సర్కారు..

ఏపీ అధికార పార్టీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు సర్కారు పై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పోరాటాలకు ఏపీ సర్కారు దిగొచ్చింది .ఇప్పటివరకు ప్రజల సమస్యలపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ..ఇటు ప్రజాక్షేత్రంలో జగన్ అండ్ బ్యాచ్ పోరాడుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే గిరిజన సలహా మండలి ఏర్పాటు కోసం జగన్‌ చేస్తోన్న మూడేళ్ల పోరాటానికి ఫలితం దక్కింది . దీంతో దిగొచ్చిన బాబు సర్కారు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్టీ రిజర్వ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో ఇన్ని రోజులు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. గవర్నర్‌ స్పందిస్తూ గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్‌ చేసింది.

గిరిజన సలహా మండలి: చైర్‌పర్సన్‌–గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్టీ, ఎస్టీ విభాగం డైరెక్టర్, రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్‌. సభ్య కార్యదర్శిగా రాష్ట్ర గిరిజన శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఉంటారు .నాన్‌–అఫీషియల్‌ సభ్యులుగా శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి (ఎమ్మెల్యే, పాలకొండ), పాముల పుష్ప శ్రీవాణి (ఎమ్మెల్యే, కురుపాం), పీడిక రాజన్నదొర (ఎమ్మెల్యే, సాలూరు), కె.సర్వేశ్వరరావు (ఎమ్మెల్యే, అరకు), గిడ్డి ఈశ్వరి (ఎమ్మెల్యే, పాడేరు), వంతల రాజేశ్వరి (ఎమ్మెల్యే, రంపచోడవరం), ఎం. శ్రీనివాసరావు (ఎమ్మెల్యే, పోలవరం). నామినేటెడ్‌ సభ్యులుగా ఎన్‌.జయకృష్ణ , గుమ్మడి సంధ్యారాణి, జనార్దన్‌ థాట్‌రాజ్, ఎం.మణికుమారి, కెపీఆర్‌కె ఫణీశ్వరి, ఎం.ధారూనాయక్, ఎం.జీవుల నాయక్, వి.రంగారావులను నియమిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat