అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రాంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇవాంకా పర్యటన పట్ల భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా చేశారని, పగలు, రాత్రిళ్లు ఎంతో ఓపికతో విరామం లేకుండా తెలంగాణ పోలీసులు విధులు నిర్వహించారని అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ ఈ లేఖలో పొగడ్తలు కురిపించారు. తెలంగాణ పోలీసుల సేవల పట్ల ఇవాంక సంతోషంగా ఉన్నారని చెప్పిన ఆయన, మీ వల్లే ఆమె పర్యటన విజయవంతం అయిందని తెలిపారు. తనిఖీల పేరిట అతిథులను ఇబ్బంది పెట్టే అవసరం లేకుండా చూడటం తమకు నచ్చిందని, అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని కితాబిచ్చారు. ఒకేరోజు రెండు కార్యక్రమాలు జరిగిన వేళ, తెలంగాణ పోలీసుల తీరు అద్భుతమని కొనియాడారు. పర్యటన ఆసాంతం రహస్యంగా ఉంచి, చివరి క్షణాల్లో వివరాలు చెబుతున్నా, పోలీసులు సంయమనంతో అర్థం చేసుకుని విధులు నిర్వహించారని, మరోసారి తెలంగాణ పోలీసులతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తుంటామని తెలిపారు.