ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి నేడు గురువారం అమరావతిలోని అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఆయన తన అనుచరులతో కలిసి ఈ రోజు సాయంత్రం అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
దీంతో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. కాగా… గురునాథ్‌రెడ్డి పార్టీలో చేరడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే… ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రభాకర్‌చౌదరితో మాట్లాడి సముదాయించినప్పటికీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదరడం కష్టంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.