Home / MOVIES / మూవీ రివ్యూ -“ఆక్సిజన్” గోపీచంద్ కు ఉపయోగపడిందా ..?

మూవీ రివ్యూ -“ఆక్సిజన్” గోపీచంద్ కు ఉపయోగపడిందా ..?

మూవీ -ఆక్సిజన్
నటీనటులు -గోపీచంద్ ,అందాల రాక్షసి రాశీ ఖన్నా ,అను ఇమ్మాన్యుయేల్ ,ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు ,కిక్ శ్యామ్ ,అలీ ,అభిమన్యుసింగ్ మొ”న వారు .
మ్యూజిక్ -యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం- వెట్రి
ఎడిటింగ్- ఎస్‌.బి.ఉద్ధవ్‌
కళ- మిలాన్‌
నిర్మాత- ఎస్‌.ఐశ్వర్య
స్క్రీన్‌ప్లే- ఎ.ఎం.రత్నం
దర్శకత్వం-ఎ.ఎం.జ్యోతి కృష్ణ
సంస్థ: శ్రీ సాయి రామ్‌ క్రియేషన్స్‌
విడుదల తేదీ: 30-11-2017
విలన్ పాత్ర నుండి హీరోగా మారిన గోపీచంద్ ఇండస్ట్రీలో ఇటు మాస్ అటు యాక్షన్ చిత్రాలే కాకుండా కుటుంబ తరహ చిత్రాల్లో కూడా నటించి అందర్నీ మెప్పిస్తాడు అని తెలుసు .ఆయన నటించి ప్రతి సినిమాకు ఏదో సరికొత్త స్టైల్ ను తన అభిమానులకు ,తెలుగు సినిమా ప్రేక్షకులకు రుచి చూపిస్తారు .అందులో భాగంగా వచ్చిన యజ్ఞం ,శౌర్యం ,లౌక్యం ,గోలీమార్ ,జిల్ వంటి చిత్రాలు ఈ కోవకు చెందుతాయి .ఈ యంగ్ హీరో తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆక్సిజన్‌’. కుటుంబ కథా నేపథ్యంతో పాటు, యాక్షన్‌ అంశాలకు పెద్దపీట వేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తనయుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ తీశాడు . సమాజంలో కొన్నేళ్లుగా జరుగుతున్న ఒక విషయాన్ని సందేశాత్మకంగా చూపించామని గోపీచంద్‌ చెప్పుకొచ్చారు. మరి ఆ సందేశం ఏంటి? బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నఆయన సినిమా కెరీర్‌కు ‘ఆక్సిజన్‌’ ఇచ్చిందా?..దాదాపు చాలా రోజుల తర్వాత మెగాఫోన్‌ పట్టిన జ్యోతికృష్ణకు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చింది?.చూద్దాం ..
అసలు కథేంటంటే:
రఘుపతి పాత్రలో నటించిన జగపతి బాబు రాజమండ్రిలో ఊరి పెద్ద. ఆయనకు ఇద్దరు ప్రధాన శత్రువులు. వారి నుంచి తన కుటుంబానికి ముప్పు ఉంటుంది. తన అన్నదమ్ములు, కూతురికి ప్రాణాపాయం ఉందని చెప్పి వారిని ఇల్లు దాటనివ్వడు. శ్రుతి(రాశి ఖన్నా)కి విదేశీ సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి ఓ అమెరికా సంబంధం చూస్తాడు. అలా కృష్ణప్రసాద్‌(గోపీచంద్‌) శ్రుతిని చూడటానికి అమెరికా నుంచి రాజమండ్రి వస్తాడు. అయితే శ్రుతికి వూరు వదిలి వెళ్లడం ఇష్టంలేదు. అందుకని కృష్ణప్రసాద్‌లో లోపాలు వెతికి సంబంధం చెడగొట్టాలని చూస్తుంది. కానీ, కృష్ణ చాలా మంచివాడు. కుటుంబానికి బాగా దగ్గరవుతాడు. దాంతో శ్రుతికి కృష్ణప్రసాద్‌కి పెళ్లి చేయాలని ఇంట్లో నిర్ణయిస్తారు. ఈలోగా శత్రువుల నుంచి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముప్పు నుంచి కృష్ణప్రసాద్‌ వారిని ఎలా రక్షించాడన్నదే ‘ఆక్సిజన్‌’ కథ.
మరి ఎలా ఉందంటే:
ఇది పక్కా పూర్తి కమర్షియల్‌ సినిమా. అయితే ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత విశ్రాంతి ముందొచ్చే ట్విస్టే ఈ చిత్రం కథకి ప్రధాన బలం. దాంతో రఘుపతి కుటుంబానికి అసలైన శత్రువెవరో తెలుస్తుంది. అప్పటివరకూ రొటీన్‌గా సాగుతున్న కథ.. ఈ ట్విస్ట్‌తో ఒక మలుపు తిరుగుతుంది. ట్విస్ట్‌ కొత్తగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఒక బలమైన సామాజిక అంశం మీద కథ నడిపించాడు దర్శకుడు. తొలి భాగం ఒక సినిమా చూస్తున్నట్లు.. ద్వితీయార్ధం మరో సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. గోపీచంద్‌ లక్ష్యం ఏంటి? రాజమండ్రి ఎందుకు వచ్చాడు? అన్నది ద్వితీయార్ధం చూస్తేనే తెలుస్తుంది. పొగతాగడం యువతరాన్ని ఎలా బలిగొంటోందో ద్వితీయార్ధంలో చక్కగా చూపించాడు దర్శకుడు. దానికి తగ్గట్టే ‘ఆక్సిజన్‌’ అన్న టైటిల్‌ని పెట్టారు. దర్శకుడు చెప్పదలుచుకున్న అంశం బాగున్నప్పటికీ దాన్ని కూడా ఒక రొటీన్‌ ఫార్ములాలో చెప్పడమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రథమార్ధంలో ట్విస్ట్‌తో ప్రేక్షకుడు షాక్‌కు గురవుతాడు. కానీ, అలాంటి ఆసక్తికర సన్నివేశాలు మరిన్ని రాసుకొని ఉంటే బాగుండేది. కేవలం ఒక ట్విస్ట్‌ను నమ్ముకుని ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. రొటీన్‌ సన్నివేశాలు లేకుండా, వినోదం పాళ్లు పెంచి ఇంకాస్త ఆసక్తికరంగా కథనాన్ని తీర్చిదిద్ది ఉండాల్సింది.అప్పుడు బాగుంటది .
ఎవరు ఎలా నటించారు ..?
చాలా రోజుల తర్వాత హీరో గోపీచంద్‌ రెండు విభిన్నమైన పార్శ్వాలున్న‌ పాత్రలు పోషించాడు. అందులో భాగంగా ఈ మూవీలో మొదటి బాగంలో బుద్ధిమంతుడిగా కనిపించిన గోపీచంద్‌.. సెకండాఫ్ లో మాత్రం తన యాక్షన్‌ ఇమేజ్‌కి తగ్గట్టు నడుచుకున్నాడు. అయితే మొదటి భాగంతో పోలిస్తే మలిభాగంలో గోపీచంద్‌ నటనకు ఎక్కువ మార్కులు పడతాయి. రాశీఖన్నా ఎప్పటిలాగే గ్లామరస్‌గా కనిపించింది. అను ఇమ్మాన్యుయేల్‌ది దాదాపు గెస్ట్‌ పాత్ర. జగపతిబాబు పాత్రలోనూ రెండు షేడ్స్‌ ఉంటాయి. పంచెకట్టులో చాలా హుందాగా కనిపించారు. అలీ కాసేపు నవ్విస్తాడు. ‘కిక్‌’ శ్యాం, అభిమన్యు సింగ్‌ ఓకే అనిపిస్తారు. యువన్‌ శంకర్‌ రాజా పాటలకన్నా నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలకి యువన్‌ ఇచ్చిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. తెలుగు భాషను వివరిస్తూ వచ్చే పాట బాగుంది. ఐటెం పాట ఉన్నా, అంతగా కిక్‌ రాలేదు. దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగుంది. దాన్ని కమర్షియల్‌గా చెప్పాలనుకున్నాడు. ఇందులో కొంతవరకు విజయం సాధించాడు. యాక్షన్‌ సన్నివేశాలను భారీగా తీర్చిదిద్దారు. అవన్నీ మాస్‌నే ఆకట్టుకుంటాయి.
బలాలు
+ విశ్రాంతి ముందొచ్చే ట్విస్ట్‌
+ దర్శకుడు ఎంచుకున్న అంశం
+ యాక్షన్‌ ఘట్టాలు
+ ద్వితీయార్ధంలో గోపీచంద్‌ నటన
బలహీనతలు
– రొటీన్‌గా సాగిన ఫస్టాఫ్‌
– గ్రాఫిక్స్‌
– రేటింగ్ : 2.45/5
– ద‌రువు పంచ్ లైన్ : ఆక్సిజన్ కమర్షియల్ గా ఒకే ..మరో కోణం అయితే ఆలోచించాలి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat