శృతి హాసన్ మొదట ఐరాన్ లెగ్ గా ముద్రపడిన కానీ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .ఆ తర్వాత మెగా పవర్ స్టార్ దగ్గర నుండి మాస్ మహారాజు రవితేజ వరకు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అమ్మడు .ఒకపక్క అందంతో మరోపక్క అభినయంతో కుర్రకారును ,సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది .
అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలేక్కనున్నది .శ్రుతి లండన్‌కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. చాలాసార్లు శ్రుతి.. మైఖేల్‌ను ముంబయికి కూడా తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు శ్రుతి ఆయనను తన తల్లి సారికకు పరిచయం చేశారట.మైఖేల్, శ్రుతి, సారిక కలిసి దిగిన ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దాంతో శ్రుతి పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. శ్రుతి తన ప్రేమ గురించి ఎప్పుడూ మీడియా ముందు నేరుగా చెప్పలేదు. అయితే ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్ విషయాలను అందరితో చెప్పుకోవడం తనకు నచ్చదని చెపుతూ..మరోపక్క పరోక్షంగా ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మైఖేల్‌ని తన తల్లికి పరిచయం చేశారు కాబట్టి, త్వరలోనే శ్రుతి పెళ్లికబురు వినిపిస్తుంది ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది .