రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరికెక్కినటువంటి తాజా చిత్రం వ్యూహం. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా హామీలు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రకటించినప్పుడే ఈ సినిమా కథ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అనే విషయాన్ని వెల్లడించడంతో ఎన్నో వివాదాలు తెర పైకి వచ్చాయి. ఈ కారణంతోనే ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..
కథ: విజయ్ శంకర్ రెడ్డి అనే రాజకీయ నాయకుడు మరణించిన తర్వాత నుంచి ఈ సినిమా కథ మొదలవడం ప్రారంభమవుతుంది.ఇలా విజయ్ శంకర్ రెడ్డి మరణం చూస్తున్న కుమారుడు మదన్ మోహన్ రెడ్డి (అజ్మల్ అమీర్) ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక తన తండ్రి మరణించిన తరువాత ఈ వార్త విని ఎంతోమంది మరణించారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి మదన్ వారందరినీ పరామర్శించడానికి వెళ్తుండగా ఈ విషయం తెలిసి భారత్ పార్టీ వద్దని చెబుతుంది. ఇక ఈ పార్టీకి తోడు ప్రతిపక్ష నేత ఇంద్ర బాబు (ధనంజయ ప్రభు) భారత పార్టీతో కలిసి మదన్ మోహన్ రెడ్డి పై లేనిపోని కేసులు పెట్టి తనని జైలుకు పంపుతారు. ఇలా ఈయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తారు నుంచి వచ్చిన తర్వాత ఇంద్ర బాబు నాయుడు శ్రవణ్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేసి గెలపొందుతారు అయితే గెలుపొందిన తర్వాత శ్రవణ్ ఇంద్ర బాబు మధ్య విభేదాలు వస్తాయి వీరిద్దరూ దూరం అవుతారు? ఇలా మీరెందుకు దూరమయ్యారు మదన్ మోహన్ రెడ్డి తిరిగి రాజకీయాలలోకి ఎలా వచ్చారు ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అనేది ఈ సినిమా కథ.
నటీనటుల నటన: ఈ సినిమాలో అజ్మల్ అమీర్ మదన్ మోహన్ రెడ్డి అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు మాలతి పాత్రలో నటి మానస ఒదిగిపోయినటించారు.ఇక ధనుంజయ ప్రభు నటన ఆయన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఇలా నటీనటులందరూ కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ: రాంగోపాల్ వర్మ ఈ సినిమా ప్రారంభంలోనే ఇవి కల్పిత పాత్రలని ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు అని చెబుతారు కానీ ఈ సినిమా ప్రకటించినప్పుడే ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డి కథ అనే విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయాలన్నింటినీ స్పష్టంగా చూపించారు. ఇక ఆయన జైలుకు వెళ్లడం తిరిగి ఎన్నికలలో పోటీ చేయడం ప్రతిపక్ష నేతగా కొనసాగడం పాదయాత్ర జగన్ ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలన్నింటినీ ఒక సినిమా రూపంలో ఈయన చూపించారు. ఇక ఈ సినిమా అందరికీ తెలిసిన కథ కావడంతో ఈ సినిమాని ఒక వైసీపీ అభిమానులు తప్ప ఇతర వర్గం వారు పెద్దగా అభిమానించకపోవచ్చు అని చెప్పాలి.
బాటమ్ లైన్: ఎన్నికలవేళ వ్యూహం అనే సినిమా వైసిపి అభిమానులకు మంచికి ఇచ్చే సినిమా అని చెప్పాలి ఈ వ్యూహం వైసిపి అభిమానులు తప్ప ఇతరులు పెద్దగా ఇష్టపడకపోవచ్చు.
రేటింగ్: 3/5