తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీ మారుతున్నాను అనే వార్తలపై క్లారీటీ ఇచ్చారు .దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశానికి మేఘాలయ కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారిగా పాల్గొన్నారు .అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను .ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీను బొంద పెట్టేవరకు కాంగ్రెస్ పార్టీను వీడను అని ఆయన అన్నారు .అయితే మీరు పార్టీ మారబోతున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును కలిశారు .పార్టీ మారబోతున్నారా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు .అయితే తన నియోజక వర్గ అభివృద్ధి కోసమే మంత్రి హరీష్ రావును కలిశాను అని ఆయన అన్నారు .
