గుర్తు తెలియని కొందరు యువకులు ఓ వివాహితపై యాసిడ్ తో దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఆ మహిళకు తీవ్రంగా గాయాలవడంతో ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు. అయితే వరంగల్లోని కొత్తవాడ గ్రామానికి చెందిన మాధురి అనే మహిళ కొన్ని రోజులుగా తన భర్త చందుకు దూరంగా ఉండి తల్లిదండ్రులతో ఉంటున్నది. ఆమెకు ఒక కొడుకు. అయితే కొద్దిరోజుల క్రితం మాధురికి చంటి అనే వ్యక్తితో మళ్లీపెళ్లి అయినట్లు తెలుస్తోంది. మాధురికి ఇటీవలే చంటితో గొడవైనట్లు సమాచారం. అయితే అసలు మాధవి ఆ గ్రామానికి ఎందుకు వెళ్లింది? ఎలా వెళ్లింది? దాడి ఎవరు, ఎందుకు చేశారు? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.