Home / education / విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి

విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి

మానసిక స్థైర్యంతో తమకి వున్న ఒత్తిడులను తొలగించుకోవాలని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆటా వేడుకల్లో భాగంగా 20 రోజుల పాటు నిర్వహించే సేవ కార్యక్రమాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అల కుటుంబం, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి ఆల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సెమినార్ లో మోటివేషనల్ స్పీకర్, RGUKT, బాసర విసి వి.వెంకటరమణ తో కలిసి జయంత్ చల్లా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ… విద్యార్థులకు తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు అందరితో ఒత్తిడులు, సవాళ్లు వుంటాయని, వాటిని ఎదుర్కొని నిలబడి విద్యార్థి తమ అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని అన్నారు. అలాగే వచ్చే భవిష్యత్ అంతా కూడా… విద్యార్థులదేనని అందుకు అనుగుణంగా కష్టపడాలి అన్నారు. మా ఆటా సేవ లక్ష్యాలలో విద్య కూడా వుందని, విద్యార్థులు ఏ సహాయం కోరినా ఆటా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సెమినార్ ను ఏర్పాటు చేసిన ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల ను అభినందించారు.

ఇదే సందర్భంలో మోటివేషనల్ స్పీకర్, RGUKT బాసర విసి వెంకటరమణ విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికలు ఎలా సిద్దం చేసుకోవాలి, ఇతర దేశాలకి వెళ్లి సెటిల్ కావడం, చదువుకోవడం లాంటివి ఎలా? అనే విషయాన్ని ప్రతి ఒక్కటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, కిషోర్ గూడూరు, వనపర్తి పరిధిలో గల 10 కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, 250 మందికి పైగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat