తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. Z+ కేటగిరి భద్రత ఉన్న కేసీఆర్కు ఇప్పుడు ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించనున్నట్లు సమాచారం.
ఆయన వెంట 4+4 గన్ మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనాలు ఉండనున్నాయి. ఇంటి ముందు సెంట్రీని పహారా ఉంచనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రతను తగ్గించిన ప్రభుత్వం, ఎమ్మెల్యేగా లేని వారికి పూర్తిగా తొలగించింది.