Home / SLIDER / భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై  స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేసు నమోదైన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇది ప్రభుత్వ కక్షకాదన్నారు.

దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు రావడంతో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయ్యింది.

దీనిపై మల్లారెడ్డి స్పందించారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంఆర్‌వోతోపాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat