ఏపీ అధికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్యే .. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పదవికి… వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే వచ్చేన్నికల్లో మంగళగిరి నుండి ఎమ్మెల్యే టికెట్ ను వైసీపీ ఆధిష్టానం బీసీలకు ఇవ్వనున్నది అని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే ఆళ్ల పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.