బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్ టిఎస్ సంఘం అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులు .వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపాం.సీఎం కేసీఆర్ గారి ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రి గారిని కలవడం జరిగింది.రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరిగింది.కేంద్రం 9ఏళ్లు నానబెట్టి ఎన్నికల వేళ కొత్త కమిటీ అని చెబుతున్నది.మనకు కావల్సింది కమిటీ కాదు బిల్లు పెట్టాలి. మా బి ఆర్ ఎస్ పార్టీ ఏకగ్రీవంగా మద్దతు ఇస్తాం.ఇన్నేళ్లు గుర్తు రాలేదు ఎన్నికలు ఉన్నాయని మాట్లాడటం మీ స్థాయికి తగదు.ఇప్పటికైనా మాకు రాజకీయాల కంటే వర్గీకరణ ముఖ్యం. బిల్లు పెట్టాలి తక్షణమే వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వర్గీకరణ తప్పకుండా చేసి తీరుతాం.వర్గీకరణకు సంబంధించి సంపూర్ణ సహకారం మా టిఆర్ఎస్ పార్టీ అందిస్తుంది.ఎంఆర్పిఎస్ తమ్ముళ్లకు నా పూర్తి సహకారం ఉంటుంది. నా గుండెల్లో పెట్టుకుంటా.ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్, డప్పు శివ, రాజేందర్, సిద్దిపేట జిల్లా ఎంఆర్పిఎస్ టి ఎస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Tags anumularevanthreddy brs congress kcr ktr slider tdp telangana assembly elections telanganacm telanganacmo thanneeru harish rao ysrcp yssharmilareddy