ప్రస్తుత బిజీ బిజీ జీవితంలో గర్భంతో ఉండగా తల్లులు ఒత్తిడి, ఆందోళనకు గురై సంఘటనలు మనం చూస్తూనే ఉంటాము .. అయితే ఇలా ఒత్తిడికి గురైన తల్లులకు పుట్టబోయే పిల్లల ప్రవర్తనపై ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది.
‘ప్రెగ్నెన్సీ సమయంలో తల్లుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి. వారికి తగిన మద్దతు ఇవ్వటమన్నది అత్యంత కీలకం. అప్పుడు పుట్టబోయే పిల్లల మానసిక ప్రవర్తనలో సమస్యలు తలెత్తవు’ అని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇరిని టంగ్ చెప్పారు. ఈ అంశానికి సంబంధించి 55 రకాల అధ్యయనంలోని గణాంకాల్ని పరిశోధకులు విశ్లేషించారు.