తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు!? ఈ ప్రశ్నకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు! ఎన్టీఆర్, వైఎస్ సెంటిమెంట్‌తో డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలోనే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు.
సీఎం ఎవరనేది అధిష్ఠానం తనకు చెప్పలేదంటూనే.. పదేళ్లపాటు అధికారం ఉంటే తెలంగాణలో మార్పు చూపిస్తానని, ఆ మేరకు విజన్ ఉందని అన్నారు! ప్రజలకు అన్నీ ఇచ్చానని అంటున్న కేసీఆర్.. వారి స్వేచ్ఛను హరించారు.
తెలంగాణ ప్రజలు ఆకలిని భరిస్తారు కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడాన్ని, అహంకారాన్ని సహించరని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అహంకారం పెరిగిందని, వారి నుంచి త్వరలోనే తెలంగాణకు విముక్తి కలుగుతుందని ప్రకటించారు!