వందేళ్ల చరిత్ర ఉందంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకీ ఇంతటి ధీన స్థితికి ఎందుకు దిగ జారింది…హేమా హేమీలు ఉన్న ఆ పార్టీకి వలస నాయకుడు పిసిసి సారధ్యం వహించడమే ఇందుకు కారణమా అంటే ఆ పార్టీ నుండే అవునని సమాధానం రావడం మరీ విచిత్రంగా ఉంది.పి సి సి ప్రెసిడెంట్ పదవిని కోటాను కోట్లు పెట్టి తెచ్చుకున్నాడని సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పై వాదాన్ని బల పరుస్తున్నాయి.దానికి తోడు తాజాగా బరితెగించి టికెట్లు అమ్ముకున్నారని తద్వారా కోట్లకు పడగలెత్తారని వస్తున్న ఆరోపణలు బల పరిచే విదంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన నేతలే ఆరోపణలు చేయడం వీటన్నింటినీ దృవీకరిస్తున్నాయి.
అధిష్టానాన్ని,నాయకత్వాన్ని మీడియా ముందు అనరాని మాటలు అన్న నేతలు ఇప్పుడు పార్టీకీ ముద్దు అయ్యారని పార్టీ మారుతున్నారన్న బాధతో ఒక్కమాట జారిన పాపానికి నా టికెట్ కట్ చేశారంటూ వరుసగా రెండుసార్లు విజయాన్ని వరించినట్లే వరించి ఓటమి అంచున నిలబడ్డ నేతకు టికెట్ నిరకరించారని ఆ పార్టీ నేతలు చేస్తున్న వాదన నూ కాదన లేదని పరిస్థితి ఏర్పడింది. గాంధీభవన్ సంగతేమో గాని అటు ఖమ్మం ఇటు నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టుల కంచుకోటలని బద్దలు కొట్టి ఆ పార్టీ లీడర్ కు క్యాడర్ కు అండగా నిలిచిన సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి టికెట్ కోసం చివరిదాకా పడి గాపులు కాయడం కష్ట కాలంలో పార్టీని కాదని బిజెపి అంచున చేరి కాసింత కాంగ్రెస్ గాలి వీస్తుందని కనిపెట్టి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి చేరంగానే బి ఫారం ఇచ్చిన పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతను చివరి దాకా ఇబ్బంది పెట్టిన తీరు దేనికి సంకేతం అన్న ప్రశ్నకు ఆ పార్టీ దగ్గర సమాధానం దొరకదు.
తెలంగాణా ఏర్పడ్డాక వరుసగా రెండుసార్లు ఓటమి అంచున నిలిచిన పార్టీకీ లీడర్ క్యాడర్ మిగలని దుస్థితికి చేరుకోగా అధికార పార్టీలో పదోపరకకు ఆశపడే నేతలకు కండువాలు కప్పి సంబరాలు చేసుకుంటున్న తీరు ఆ పార్టీ క్యాడర్ కే నవ్వుతెప్పిస్తుంది.పైగా వచ్చినోళ్లు ప్యాకేజి మాట్లాడుకుని వచ్చారంటూ వస్తున్న ప్రచారం ప్రజాక్షేత్రంలో ఆ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టాయి.ముడుపులు ముట్ట జెప్పే పిసిసి పదవి తెచ్చుకున్నారన్న ఆరోపణలు మొదలు ఇతర పార్టీల నుండి చేరిన వారికి ముడుపులు ముట్ట జెపుతున్నారన్న ప్రచారం ప్రజా క్షేత్రంలో ఆ పార్టీకీ తీవ్రంగా నష్టం కలిగిస్తుందన్న సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం వందేళ్ల పార్టీకీ పూర్వ వైభవం అటుంచి ఉన్న వైభోగం కరువు అయ్యేటట్లు ఉందన్న వాస్తవాన్ని గ్రహించకాలేని దుస్థితికి ఆ పార్టీ చేరుకుంది.