Home / SLIDER / టీబీజేపీ అఖరి జాబితా విడుదల

టీబీజేపీ అఖరి జాబితా విడుదల

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ చివరి జాబితాను ప్రకటించింది. ఈ రోజు శుక్రవారం ఉదయం 14 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

అయితే ముందు 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా మూడు స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పు చేర్పులు చేసి చివరకు 14 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ రిలీజ్ చేసింది. వనపర్తి, చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి అభ్యర్థులను మారుస్తూ బీజేపీ అధిష్టానం చివరి జాబితాను విడుదల చేసింది.

వనపర్తిలో అశ్వద్ధామరెడ్డికి బదులు అనుగ్నారెడ్డికి  టికెట్ ఇచ్చింది. బెల్లిపల్లిలో శ్రీదేవి   బదులు కొయ్యాల ఏమాజీకి  టికెట్ కేటాయించింది. బెల్లంపల్లిలో నిన్ననే బీజేపీ అభ్యర్ధిగా శ్రీదేవి నామినేషన్ వేశారు. అలాగే చాంద్రాయణగుట్ట అభ్యర్థి సత్యనారాయణ ముదిరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంతో చాంద్రాయణగుట్టలో సత్యనారాయణకు బదులు మహేందర్‌కు టికెట్ కేటాయిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

14మంది అభ్యర్థుల చివరి జాబితా…

బెల్లంపల్లి – కొయ్యాల ఎమాజీ

పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్ రావు

సంగారెడ్డి – రాజేశ్వరరావు

నర్సంపేట – పుల్లారావు

దేవరకద్ర – కొండా ప్రశాంత్ రెడ్డి

నాంపల్లి – రాహుల్ చంద్ర

కంటోన్మెంట్ – గణేష్

శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్

మల్కాజ్ గరి – రామచంద్రరావు

మేడ్చల్ – ఏనుగు సుదర్శనరెడ్డి

వనపర్తి- అనుగ్నారెడ్డి

చాంద్రాయణగుట్ట – మహేందర్

మధిర – విజయరాజు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat