పాలేరు నియోజకవర్గంలో రామన్నపేట డివిజన్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన పాలేరు నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి డివిజన్ కి విచ్చేసిన సందర్భంగా నాకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులకు,బిఆర్ఎస్ నాయకులకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు.
నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి,మీరు పిలిస్తే పలికేలా ఉండాలి అని తెలిపారు.ఇట్టి డివిజన్ను కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు.నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి,వాటిని కూడా పరిష్కారం చేస్తామని తెలిపారు.అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి మ్యానిపేస్టో అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చుతుంది అని తెలిపారు. కావున వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి,నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క తోడ్పాటు అందించాలని కోరారు.