కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లాస్ట్ బస్సు స్టాపు వద్ద జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సుభాష్ నగర్ కు చెందిన టీడీపీ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు, గత కార్పొరేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన సీనియర్ నాయకుడు బలరాం రెడ్డి గారు, మరియు డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ గౌడ్ అలాగే టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి దుర్గ రావు గార్లు వారి అనుచరులతో పాటు ఎమ్మెల్యే వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు..
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సహకారంతో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు అన్నారు, ఎమ్మెల్యే వివేకానంద గారి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గత తొమ్మిది సంవత్సరాల నుండి వేగంగా అభివృద్ధి చెందుతోందని, కుత్బుల్లాపూర్ అభివృద్ధి ఎమ్మెల్యే వివేకానంద గారితోనే సాధ్యం అని తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగిందని వారు అన్నారు..
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, మన్నే రాజు, బోబ్బా రంగ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ టి.లక్ష్మ రెడ్డి, అడపా శేషు, సారిపల్లి పద్మజ, మాధవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సత్యమూర్తి, లాల్ రాజ్, బాల కుమార్, అమర్నాథ్ రెడ్డి, నాగ ప్రసాద్, నారాయణ, మురళి రాజు, నాగేశ్వర్ రావు, కృష్ణ శ్రీనివా రాజు తదితరులు పాల్గొన్నారు..