Home / SLIDER / జాన్ పహాడ్ సైదన్న సన్నిధిలో శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక పూజలు

జాన్ పహాడ్ సైదన్న సన్నిధిలో శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక పూజలు

నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా   హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండలం, జానపాడు దర్గా దగ్గర లోని JPS ఫంక్షన్ హాల్ నందు పాలకీడు మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.అంతకుముందు… పాలకీడు మండలం, జాన్ పహాడ్ సైదన్న దర్గా దర్శించుకుని, జాన్ పహాడ్ సైదన్న సన్నిధిలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించినారు.ఈ సందర్భంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, హుజుర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని,నియోజకవర్గ ప్రజలు అందరికీ జాన్ పాడు సైదులు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు తదనంతరం…….

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్టా పాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మండల బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హుజుర్ నగర్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారు.. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ,ఎన్నికల ఇంచార్జి తిప్పన విజయసింహరెడ్డి గారితో కలసి విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.పాలకీడు మండల సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ ఇంచార్జిలు, గ్రామ ఇంచార్జిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో కలిసి, బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొని, అందరికీ దిశా నిర్దేశం చేయడం జరిగింది.ఎన్నికల ప్రచార శైలి, అనురించాల్సిన పద్ధతులపై నాయకులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో మన హుజుర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని అత్యధిక మెజారిటీ తో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని అన్నారు.గ్రామాలలోని ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు వెళ్లి గత పదేళ్లలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాలని తెలిపారు. గత నాలుగేళ్ల కాలంలో.. మన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. దాదాపు 4వేల కోట్లతో అభివృధ్ది జరిగింది అన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను స్వయంగా కలిసి మాట్లాడాలని అన్నారు.

అభివృద్ధి వైపే హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఉంటారని, మరోసారి భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరు అడ్డుకోలేరని తెలిపారు.ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టులను నమ్మొద్దు.. అని కొందరు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తరని, అలాంటి వారికి రాజకీయ సన్యాసం తప్పదని అన్నారు. ఈనెల అక్టోబర్ 31న హుజుర్ నగర్ లో జరిగే సీఎం కెసిఆర్ గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు పార్టీ శ్రేణులు అంతా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.మండలానికి 15 వేల మంది హాజరు కావాలి,జన సమీకరణకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో.. స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat