తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభమైన జీఈఎస్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. భారత ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని 5 గొప్ప సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు ఉన్నాయని తెలిపారు.
ఇక్కడ పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. టీఎస్ ఐపాస్‌తో సులభతర విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఇప్పటికే 5469 ఇండస్ట్రీయల్ యూనిట్స్‌కి అనుమతులు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. ఈ సదస్సులో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలు పంచుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు.అంతకుమందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మెట్రో రైలును ప్రారంభించి హెచ్ఐసీసీకి వచ్చిన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో అరగంటకు పైగా చర్చలు కొనసాగించిన తర్వాత ఆమె మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చారు.అనంతరం ఎస్కలేటర్ ద్వారా కిందకు వచ్చిన ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ఆమె నవ్వుతూ పలకరించారు. సీఎంకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.