గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండల పరిధిలోని రంగాపురం, రంగాపురం తాండా గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు వెంకటేష్, హనుమంతు కురు వంతు సవారప్ప జగన్నాథ్ పైగా ఆ పార్టీలకి గుడ్ బై చెప్పి నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుట కు బిఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మరియు గద్వాల ఎన్నికల ఇంచార్జ్ రాకేష్ గారు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారు.
వీరి పాటు కిష్టప్ప వెంకటేష్ ,నరేష్ జంగిలప్ప, జగదీష్, అడివప్ప జయన్న, జగ్గన్న వడ్డతిమ్మప్ప, నరసింహులు అడివప్ప పరుశురాముడు, గోవిందు, పాలెం గోవిందు ,బంగారప్ప, పాపయ్య రాములు హనుమంతు, తిమ్మప్ప బంగారప్ప, రామయ్య, బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, కార్యక్రమాలు ఈ 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు